TS ZONAL SYSTEM : జిల్లా కేడర్ ఉద్యోగుల పోస్టింగులు పూర్తి: సీఎస్ - జిల్లా కేడర్ ఉద్యోగుల పోస్టింగుల ప్రక్రియ పూర్తి
21:37 January 07
TS ZONAL SYSTEM : జిల్లా కేడర్ ఉద్యోగుల పోస్టింగుల ప్రక్రియ పూర్తి
TS ZONAL SYSTEM : రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు 2018కి అనుగుణంగా జిల్లా కేడర్ ఉద్యోగుల పోస్టింగుల ప్రక్రియ పూర్తైనట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 22,418 మంది ఉపాధ్యాయులకు గాను సాయంత్రం 6 గంటల వరకు 21,800 మంది కొత్త స్థానాల్లో చేరారని, మిగిలిన ఉపాధ్యాయులు కూడా అర్ధరాత్రి లోపు విధుల్లో చేరతారని పేర్కొంది. 13,760 మంది జిల్లా స్థాయి ఇతర ఉద్యోగులు కూడా కొత్త స్థానాల్లో చేరినట్లు తెలిపింది.
జోనల్, మల్టీజోనల్ కేడర్ ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందన్న రాష్ట్ర ప్రభుత్వం... రేపటి వరకు వారి పోస్టింగుల ప్రక్రియ కూడా పూర్తవుతుందని పేర్కొంది. విస్తృత ప్రక్రియను స్వల్పకాలంలోనే పూర్తి చేయడం గొప్ప విషయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేసిన అన్ని శాఖల కార్యదర్శులు, కలెక్టర్లు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రక్రియ పూర్తి చేసేందుకు మార్గనిర్దేశం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పారు. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుతో ఉద్యోగాల్లో స్థానికులకు 95శాతం అవకాశాలు దక్కుతాయని సీఎస్ అన్నారు.
ఇదీ చూడండి:TS CETS 2022: ప్రవేశ పరీక్షల కన్వీనర్లను నియమించిన ఉన్నత విద్యా మండలి