TS New zonal system : రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖ మినహా జోనల్ కేడర్ ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ పూర్తయింది. సీనియారిటీ జాబితా, ఉద్యోగులు ఇచ్చిన ఐచ్చికాల ఆధారంగా వారిని ఆయా జోన్లకు కేటాయించారు. కేటాయింపుల ఆదేశాలు అందుకున్న ఉద్యోగులు మూడు రోజుల్లోగా సంబంధిత నోడల్ అధికారి వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకోవచ్చు.
TS New zonal system : ఆ శాఖ మినహా జోనల్ కేడర్ ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి - జోనల్ కేడర్ ఉద్యోగుల కేటాయింపు పూర్తి
TS New zonal system : వైద్య, ఆరోగ్య శాఖ మినహా జోనల్ కేడర్ ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ పూర్తయింది. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకోవచ్చు.
ఆ తర్వాత మిగతా ప్రక్రియ, పోస్టింగుల కోసం కౌన్సెలింగ్ సహా ఇతరత్రాలు ఉంటాయి. ఇందుకోసం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది. అటు జిల్లా కేడర్ ఉద్యోగులకు సంబంధించి వారి నుంచి ఇప్పటికే ఐచ్చికాలు తీసుకున్నారు. స్పౌస్ కేసులకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనా ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఆ ప్రక్రియ పూర్తి కాగానే కౌన్సిలింగ్ పూర్తి చేసి ఉద్యోగులకు కొత్త పోస్టింగులు ఇస్తారు.
ఇదీ చూడండి:సొంత జిల్లాలకు బదిలీలు, పోస్టింగులు.. కొత్తగా కేటాయించిన ఉద్యోగులకే అవకాశం!