మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. గతంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును వ్యక్తిగతంగా దూషించి... తాజాగా ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను బ్రోకర్ అని మాట్లాడారని సంఘం అధ్యక్షుడు గంధం రాములు కమిషన్‌కు వివరించారు.
ఒక సీనియర్ నాయకుడిగా భారత రాజ్యాంగ చట్టాలు తెలిసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్‌పై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేయడంతో పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న శ్రీనివాస్ గౌడ్‌ను అసభ్య పదజాలంతో దూషించడంపై మండిపడ్డారు.