తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ సబ్జెక్టులు చదవకున్నా ఇంజినీరింగ్‌కు అనుమతి! - బీటెక్ ప్రవేశాలు

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇంటర్మీడియట్‌, తత్సమాన కోర్సులో రసాయనశాస్త్రం సబ్జెక్టు చదవకున్నా కొన్ని బీటెక్‌ బ్రాంచీల్లో ప్రవేశం ఇవ్వాలా.. వద్దా.. అన్న నిర్ణయం తీసుకునేందుకు నిపుణుల కమిటీని నియమించింది. నూతన జాతీయ విద్యావిధానంతో.. పలు ఆప్షన్‌ సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం త్వరలోనే వస్తుందని, అందుకే నిపుణుల కమిటీని నియమించినట్లు తెలిపింది.

inter
inter

By

Published : Dec 2, 2022, 12:54 PM IST

ఇంటర్మీడియట్‌, తత్సమాన కోర్సులో రసాయనశాస్త్రం సబ్జెక్టు చదవకున్నా కొన్ని బీటెక్‌ బ్రాంచీల్లో ప్రవేశం ఇవ్వాలా.. వద్దా.. అన్న నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిపుణుల కమిటీని నియమించింది. ఈ విద్యాసంవత్సరానికి కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, సీఈఈ, ఈఈఈ తదితర బీటెక్‌ బ్రాంచీల్లో ప్రవేశానికి ఇంటర్‌ స్థాయిలో రసాయనశాస్త్రం, అగ్రికల్చర్‌, బయోటెక్నాలజీ ఇంజినీరింగ్‌కు గణితం, బి-ప్లానింగ్‌కు భౌతిక, రసాయన శాస్త్రాలు చదవడం తప్పనిసరి కాదని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) స్పష్టం చేసింది.

రాష్ట్రంలో ఎంపీసీ గ్రూపులో గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం చదవడం తప్పనిసరి. అందువల్ల ఇంటర్‌బోర్డు విద్యార్థులకు ఏఐసీటీఈ వెసులుబాటు వల్ల ప్రయోజనం లేదు. సీబీఎస్‌ఈ, ఇతర బోర్డుల్లో ఇలాంటి వెసులుబాటు ఉంటుంది. అలాంటి వారు వస్తే ప్రవేశం కుదరదు అని చెప్పలేని పరిస్థితి నెలకొంటుంది. వారి కోసమైనా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి వర్గాలు భావిస్తున్నాయి. నూతన జాతీయ విద్యావిధానంతో.. పలు ఆప్షన్‌ సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం త్వరలోనే వస్తుందని, అందుకే నిపుణుల కమిటీని నియమించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details