తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజాబహదూర్​ వెంకటరామిరెడ్డి సేవలు అజరామరం - రాజాబహదూర్ వెంకటరామ రెడ్డి

హైదరాబాద్​ నారాయణగూడ చౌరస్తాలోని రాజా బహదూర్​ వెంకటరామ రెడ్డి విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రథమ కొత్వాల్​గా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని నగర పోలీస్​ కమిషనర్​ కొనియాడారు. బహదూర్​ స్మారక బంగారు పతకాన్ని పలువురు పోలీస్​ అధికారులకు అందజేశారు.

రాజా బహదూర్​ వెంకటరామిరెడ్డి సేవలు అజరామరం

By

Published : Aug 22, 2019, 11:25 PM IST

రాజాబహదూర్ వెంకటరామ రెడ్డి ప్రథమ కొత్వాల్​గా సుదీర్ఘకాలం ప్రజలకు సేవలు అందించారని నగర పోలీస్​ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. హైదరాబాద్ నారాయణగూడ చౌరస్తాలోని రాజా బహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వెంకటరామ రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని నగర పోలీస్ కమిషనర్ కొనియాడారు. వృత్తిలో ప్రతిభకనబరిచిన వారికి స్మారక బంగారు పతకాన్ని, రూ. 5వేల నగదును అందజేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కె.వి.రంగారెడ్డి కుమారుడు ప్రొఫెసర్ కె. రామచంద్రారెడ్డి సైబరాబాద్ క్రైం ఎస్సై విజయవర్ధన్​కు బంగారు పతకాన్ని అందజేశారు.

రాజా బహదూర్​ వెంకటరామిరెడ్డి సేవలు అజరామరం

ABOUT THE AUTHOR

...view details