తెలంగాణ

telangana

ETV Bharat / state

వాణిజ్య పన్నుల శాఖలో డ్రైవర్ల సమ్మె

గత ఆరు నెలలుగా వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో పనిచేసే డ్రైవర్లకు జీతాలు చెల్లించకపోవటం వల్ల నాంపల్లిలోని కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వం స్పందించి తమకు బకాయిలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

By

Published : Sep 3, 2019, 5:13 PM IST

వాణిజ్య పన్నుల శాఖలో డ్రైవర్ల సమ్మె

హైదరాబాద్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో పని చేసే డ్రైవర్లకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడంలేదు. దీంతో తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ సమ్మెకు దిగింది. పెండింగ్​లో ఉన్న బకాయిలు చెల్లించాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టించుకోకపోవటం వల్ల సమ్మెకు దిగాల్సి వచ్చిందని అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. ఆరు నెలలు నుంచి అద్దె వాహనాల బిల్లు విడుదల చేయకపోవటం వల్ల ఫైనాన్స్ యజమానులకు నెలనెలా డబ్బులు ఇవ్వటంలేదన్నారు. వాహనాలు బలవంతంగా తీసుకెళ్లతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధను అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని బకాయిలను త్వరగా చెల్లించాలని డిమాండ్ చేశారు.

వాణిజ్య పన్నుల శాఖలో డ్రైవర్ల సమ్మె

ABOUT THE AUTHOR

...view details