ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి వేడుకల్లో కోడిపందేలు మూడు రోజుల పాటు కావాల్సినంత వినోదాన్ని పంచాయి. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో కోడిపందేలు పెద్ద ఎత్తున సాగాయి. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే దాదాపు 700 వరకూ చిన్నా,పెద్దా బరుల్లో... పందేలు నిర్వహించారు.ఆఖరిరోజైన కనుమనాడు మళ్లీ అవకాశం కోసం ఏడాది ఆగాలన్నట్లుగా పెద్దఎత్తున పందేలు వేశారు. కృష్ణా జిల్లాలో కొన్నిఎకరాల్లో ఏర్పాటు చేసిన బరులు జాతరను తలపించాయి. నిర్వాహకులు భారీ ఏర్పాట్ల నడుమ పోటీలు నిర్వహిచారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో రాత్రి పొద్దుపోయేదాకా పందేలు జరిపారు. బహిరంగంగానే కరెన్సీ నోట్లు చేతులుమారగా కొందరు మొబైల్ యాప్‌ల ద్వారా కూడా చెల్లింపులు జరిపారు. విజేతలకు కాసులపంట పండగా.. నిర్వాహకులకూ లాభాలు బాగానే మిగిలాయి.
పందెం రాయుళ్లకు... కాసుల పంట - AP LATEST NEWS
ఏపీలో సంక్రాంతి కోడిపందేల్లో వందలకోట్లు చేతులు మారాయి. పందెం రాయుళ్లకు కాసుల పంట పండితే నిర్వాహకులకు కమిషన్ల వర్షం కురిసింది. గెలిచినోళ్లు కాలర్ ఎగరేస్తే... ఓడినోళ్లు వచ్చే ఏడాది తడాఖా చూపిస్తాం అంటూ సర్దిచెప్పుకున్నారు. గోదావరి, కృష్ణాజిల్లాల్లో... ఈవెంట్ తరహాలో నిర్వహించిన పందేలు చూసి.. ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
cock fight
దేశవిదేశాల్లో స్థిరపడి సంక్రాంతికి సొంతూరు వచ్చినవాళ్లు కోడిపందేలను ఆసక్తిగా చూశారు. కృష్ణా జిల్లాలోని పెద్ద బరుల వద్దకు మహిళలు పిల్లలతో... సహా వచ్చి తిలకించారు. హైదరాబాద్, కర్ణాటకతోపాటు కృష్ణా జిల్లాకు చెందిన ప్రవాసులు కూడా..... తొలిసారి పందేలు చూశామంటూ సంబరపడ్డారు. ఇక బరుల వద్ద గుండాటల వంటి జూదాలూ జోరుగా జరగాయి. అక్కడ కూడా పెద్దఎ్తతున పచ్చనోట్లు చేతులు మారాయి
ఇదీ చదవండి:ప్యాంటులో బంగారం అక్రమ రవాణా