తెలంగాణ

telangana

ETV Bharat / state

టార్గెట్... పోలీస్ కొలువు..!

మహిళలు వంటింటికి పరితమయ్యే రోజులు పోయాయి. తామేం తక్కువ కాదంటూ పురుషులతో అన్నిరంగాల్లో పోటీ పడుతున్నారు. అన్ని రకాల ఉద్యోగాల్లో తామేంటో నిరూపించుకుంటున్నారు. యూనిఫామ్​ కొలువులు సాధించడంలోనూ.. ముందుంటున్నారు.

జంప్​ చేస్తున్న అమ్మాయిలు

By

Published : Feb 14, 2019, 5:39 AM IST

Updated : Feb 14, 2019, 5:58 AM IST

ఆడవారు ఎందులోనూ తక్కువకాదంటూ ఎప్పటికప్పుడూ నిరూపిస్తునే ఉన్నారు. మగవారితో సమానంగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. సుకుమారంగా ఉండే కొలువులే కాదు... కఠినంగా ఉండే పోలీస్​, ఆర్మీ ఉద్యోగాల్లోనూ సత్తా చాటుతున్నారు. యూనిఫామ్​ ఉద్యోగాల కోసం కఠోరంగా శ్రమిస్తున్నారు. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయ మైదానంలో అతివలు పోలీస్ కొలువుల కోసం కసరత్తులు చేస్తున్నారు.

పురుషులతో పోటీపడుతూ కఠోర సాధన చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎలాగైనా.. ఉద్యోగం సంపాదించాలనే కసితో చెమటోడుస్తున్నారు. లాంగ్ జంప్, హై జంప్​, పరుగు విభాగాల్లో సాధన చేస్తున్నారు. దేహదారుఢ్య పరీక్షల్లో నెగ్గేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. వరంగల్​ అర్బన్​ పోలీసులు సుమార్గ్ ద్వారా వీరికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.

సుమారు 250 మంది యువతులతో పాటు 400 మంది యువకులు సుమార్గ్ ద్వారా శిక్షణ పొందుతున్నారు. ఇందుకు ఎస్సై స్థాయి అధికారులతో ఓ టీం ఏర్పాటు చేశారు. ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పోలీసులకు అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదివరకే సుమార్గ్​ ద్వారా చాలా మంది ఉద్యోగాలు సంపాదించారని అధికారులు పేర్కొన్నారు.

నిత్యం శాంతి భద్రతలను కాపాడటమే కాకుండా పోలీసులు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

టార్గెట్... పోలీస్ కొలువు..

Last Updated : Feb 14, 2019, 5:58 AM IST

ABOUT THE AUTHOR

...view details