హైదరాబాద్ వరదప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం పలు సంస్థలు సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించి దాతృత్వం చాటుకుంటున్నాయి. తాజాగా దివీస్ లేబరేటరీస్ రూ.ఐదు కోట్లు, జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం రూ.రెండున్నర కోట్లను విరాళంగా ఇచ్చాయి. స్నేహ ఫౌండేషన్, పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్, శ్రీచైతన్య స్టూడెంట్స్ ఫెసిలిటీ మేనేజ్మెంట్, పౌల్ట్రీ ఫెడరేషన్ రూ.కోటి చొప్పున విరాళాన్ని అందించాయి.
వరద బాధితుల కోసం పలు సంస్థల దాతృత్వం - సీఎం సహాయ నిధికి విరాళాలు
ఇటీవల కురిసిన వర్షాలు హైదరాబాద్‌ను చిన్నాభిన్నం చేశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయి చాలామంది నిరాశ్రయులయ్యారు. వరద బాధితులను ఆదుకోవడానికి పలువురు దాతృత్వంతో ముందుకు వస్తున్నారు. తాజాగా మరికొన్ని సంస్థలు సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించాయి.
వరద బాధితుల కోసం పలు సంస్థల దాతృత్వం
లారస్ ల్యాబ్స్ రూ.50లక్షలు, రామకృష్ణ రూ.ఐదు లక్షలను విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు ఆయా సంస్థల ప్రతినిధులు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌కు చెక్కులు అందజేశారు.