ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అడవుల పునరుద్దరణ, సంరక్షణ కోసం గడచిన ఆరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న.. "తెలంగాణకు హరితహారం" కార్యక్రమం సాధిస్తున్న ఘనతను సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
అటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం - telangana haritha haram
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ప్రపంచ అటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అడవుల పునరుద్ధరణ, సంరక్షణకుగాను గడచిన ఆరేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న "తెలంగాణకు హరితహారం" కార్యక్రమం సాధిస్తున్న ప్రగతిని ఆయన గుర్తు చేసుకున్నారు.
అటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం
పచ్చదనాన్ని పెంచే కృషిలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి.. దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రం నిలిచిందని కేసీఆర్ అన్నారు. హరిత యజ్జంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరినీ ముఖ్యమంత్రి అభినందించారు.
ఇదీ చూడండి:పీవీ గెలిచినట్టా? కేసీఆర్ గెలిచినట్టా?