తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎట్టిపరిస్థితుల్లోనూ లాక్‌డౌన్‌ విధించం: సీఎం కేసీఆర్

తెలంగాణలో లాక్​డౌన్​పై అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ స్పష్టతనిచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ లాక్​డౌన్​ విధించబోమని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ వల్ల గతేడాది చాలా నష్టపోయామని అన్నారు.

cm kcr, corona, lockdown
కేసీఆర్

By

Published : Mar 26, 2021, 1:53 PM IST

Updated : Mar 26, 2021, 3:13 PM IST

తెలంగాణలో లాక్​డౌన్​పై సీఎం కేసీఆర్ స్పష్టత

కరోనా నియంత్రణలో తెలంగాణ నంబరు వన్​గా ఉన్నట్లు శాసనసభలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యానే విద్యాసంస్థలను మూసివేయించామని స్పష్టం చేశారు. కరోనా విస్పోటనమైన రూపం తీసుకోకముందే చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. తెలంగాణ సహా ప్రపంచాన్ని కరోనా వేధిస్తోందన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కేంద్రం చేతిలో ఉందని చెప్పారు. కేంద్రం టీకా డోసులను అన్ని రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేస్తోందని తెలిపారు. తాత్కాలికంగానే విద్యాసంస్థలు మూసివేసినట్లు ప్రకటించారు.

కొందరు సినీపెద్దలు నన్ను కలిశారు. మళ్లీ లాక్‌డౌన్‌పై వస్తున్న ప్రచారం గురించి అడిగారు. మళ్లీ లాక్‌డౌన్ విధించే ఆలోచన ఉందా అని అడిగారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టామని వివరించారు. కొన్ని సినిమాలు నిర్మాణ మధ్యలోనే ఉన్నాయని చెప్పారు.

- సీఎం కేసీఆర్

లాక్‌డౌన్ వల్ల గతేడాది చాలా నష్టపోయామని సీఎం కేసీఆర్ అన్నారు. తొందరపడి లాక్‌డౌడ్‌ పెట్టబోమని స్పష్టం చేశారు. మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని సూచించారు.

Last Updated : Mar 26, 2021, 3:13 PM IST

ABOUT THE AUTHOR

...view details