తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Speech at NIMS : 'సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాల లక్ష్యం అదే' - హరీశ్‌రావు తాజా వార్తలు

CM KCR Speech at NIMS Hospital Today : భవిష్యత్‌లో కరోనాను మించిన విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొనేలా వైద్యరంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ప్రజలందరికీ అందరికీ వైద్యం అందించాలనే లక్ష్యంతోనే ఆసుపత్రులు, వైద్యకళాశాలల నిర్మాణాన్నిచేపట్టినట్లు వెల్లడించారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో మరో ముందడుగు పడిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇప్పటికే ఐటీ, ఫార్మా హబ్‌గా తెలంగాణ సీఎం కేసీఆర్‌ దార్శనికతతో హెల్త్‌హబ్‌గా కూడా తయారవుతోందని స్పష్టం చేశారు.

CM KCR
CM KCR

By

Published : Jun 14, 2023, 2:10 PM IST

Updated : Jun 14, 2023, 5:23 PM IST

హైదరాబాద్‌లో మరో నాలుగు ఆస్పత్రులు కడుతున్నాం: కేసీఆర్

CM KCR Speech at NIMS New Bolck Foundation: దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నిమ్స్ ఆస్పత్రిలో దశాబ్ది పేరుతో నిర్మించనున్న 2వేల పడకల నూతన బ్లాక్‌ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్... వైద్యారంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వైద్యరంగంలో తెలంగాణను అగ్రగ్రామిగా తీర్చిదిద్దాలనే వైద్యసిబ్బంది పనిచేయాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

'వరంగల్‌లో ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఆస్పత్రి కడుతున్నాం. హైదరాబాద్‌లో మరో నాలుగు ఆస్పత్రులు కడుతున్నాం. రాష్ట్రంలో బాలింత మరణాలు, శిశుమరణాలు తగ్గాయి. కరోనా సమయంలో గాంధీ ఆస్పత్రి డాక్టర్‌ రాజారావు సేవలు మరువలేనివి. ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేసిన కరోనా రోగులను గాంధీ వైద్యులు కాపాడారు. ప్రపంచంలో మానవజాతి ఉన్నంత కాలం వైద్య రంగం ఉండాలి. వైద్యానిది మానవజాతిది అవినాభావ సంబంధం. 2014లో వైద్యారోగ్యశాఖకు కేటాయింపులు రూ. 2,100 కోట్లు. 2023-24లో వైద్యారోగ్యశాఖకు కేటాయింపులు రూ.12,367 కోట్లు.'-సీఎం కేసీఆర్

CM KCR Comments on Nutrition KITS :గర్భస్థ శిశువుల ఎదుగుదలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ రూపొందించామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖ అనేది చాలా ముఖ్యమైనదన్నారు. సొంతంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను తయారు చేసుకున్నామన్న సీఎం కేసీఆర్‌... 550 టన్నుల ఆక్సిజన్ తెలంగాణలో ఉత్పత్తి అవుతుందన్నారు. అలాగే 17 వేల నుంచి 50 వేల పడకలకి ఆసుపత్రులను పెంచుకున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో కరోనాను మించిన వైరస్‌లు వస్తాయని వైద్య నిపుణులు చెప్పారన్నారు. తెలంగాణ వచ్చాక ఆరోగ్యశాఖ అతికీలకమైందని భావించామన్న ఆయన... వైద్య సిబ్బంది ఆరోగ్య శాఖ బలోపేతానికి ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

'వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు చురుకైన వ్యక్తి. పోలీస్ శాఖను ఎంతో ఫ్రెండ్లీగా మార్చాం. వైద్యారోగ్య శాఖలో పీఆర్ పెంచి... ప్రజల కోసమే ఆస్పత్రులని తెలియజేయాలి. గతంలో 30 శాతం ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు ఉంటే ఇప్పుడు 70శాతం పెంచాం. టెలిమెడిసిన్ సేవలు మరింత విస్తరించాలి. న్యూట్రిషన్‌ కిట్‌ ఇవ్వడం వెనుక చాలా ఆలోచన ఉంది. న్యూట్రిషన్‌ కిట్లతో ఒక తరం ఆరోగ్యకరంగా పెరుగుతుంది. గతంలో ఉస్మానియా, గాంధీ, నీలోఫర్‌ వంటి ఆస్పత్రిలే దిక్కు. వైద్యారోగ్యశాఖకు సహజంగా విమర్శలే ఎక్కువ.. ప్రశంసలు తక్కువ. వైద్య శాఖ ప్రభుత్వంలో మొదటి స్థానంలో ఉందనేల ఎదగాలి. ఆ శాఖ పై ఉన్న విమర్శలు పోయేలా సిబ్బంది కృషి చేయాలి.' -ముఖ్యమంత్రి కేసీఆర్

Minister Harishrao Speech at Nims : ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో మరో ముందడుగు పడిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇప్పటికే ఐటీ, ఫార్మా హబ్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికతతో హెల్త్‌హబ్‌గా కూడా తయారవుతోందని స్పష్టం చేశారు. 10 వేల పడకలతో ఆస్పత్రులను నిర్మించుకుంటున్నామన్న ఆయన... నిమ్స్‌లో 2 వేల పడకలతో బ్లాక్‌లను నిర్మించుకుంటున్నామన్నారు. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా వైద్యారోగ్యశాఖ పనిచేస్తోందన్నారు. హెల్త్‌హబ్‌గా హైదరాబాద్‌ తయారు కాబోతోందన్న హరీశ్‌రావు... జిల్లాకో మెడికల్‌ కాలేజీ వచ్చిందని అన్నారు. రక్తహినతతో బాధ పడుతున్న మహిళలకు న్యూట్రిషన్ కిట్‌ వరమన్నారు. పుట్టబోయే బిడ్డలు బలంగా ఉంటే రాష్ట్రం బలంగా ఉంటుందని హరీశ్‌ పేర్కొన్నారు. న్యూట్రిషన్ కిట్‌ గర్భిణీలకు నాలుగో నెలలో ఒకసారి, ఏడో నెలలో ఒకసారి అందిస్తామన్నారు.

మావి న్యూట్రీషన్ పాలిటిక్స్... కొందరివి పార్టీషన్ పాలిటిక్స్ : '60 ఏళ్లలో గత ప్రభుత్వాలు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం మరిచాయి. తెలంగాణ వచ్చాక 10వేల సూపర్ స్పెషలిటీ పడకలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి. కిడ్నీ రోగులకు ఆసరా పింఛన్లు, ఉచిత బస్ పాస్‌లు. 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. జిల్లాకు ఒక నర్సింగ్, పారామెడికల్ కాలేజీల ఏర్పాటుకు కృషి. కేసీఆర్ తల్లిలా ఆలోచించి న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు కిట్‌లు అందిస్తే... ప్రతి పక్షాలు తిట్లు ఇస్తున్నారు. మనది న్యూట్రీషన్ పాలిటిక్స్... కొందరివి పార్టీషన్ పాలిటిక్స్. అధికారం కోసం నోటికొచ్చినట్లు మాట్లాడే వారిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐ స్క్రీనింగ్ తెలంగాణలో జరిగింది. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, కందిళ్ల మోతలు. టీఆర్ఎస్ పాలనలో కంటి వెలుగులు.'-హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

ఇవీ చదవండి :

Last Updated : Jun 14, 2023, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details