తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇక ఏడాదంతా నిండుకుండలా రిజర్వాయర్లు'

సమగ్ర వ్యాధి నిర్ధరణ పరీక్షలు జరిపి, తెలంగాణ ఆరోగ్య సూచిక (హెల్త్ ప్రొఫైల్) రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా మరెన్నో పథకాలతో ముందుకొస్తున్నామన్నారు.

అడుగడుగునా అభివృద్ధికై ఎన్నెన్నో పథకాలు

By

Published : Jun 2, 2019, 10:49 AM IST

రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది... మరిన్ని కూడా చేయబోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలను సస్యశ్యామలం చేసే దిశగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోత పథకాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ తలరాతను మార్చేయబోతున్నామని కేసీఆర్ చెప్పారు. 365 రోజులూ తెలంగాణ చెరువులు, రిజర్వాయర్లు, బ్యారేజీలు నిండు కుండలను తలపించేలా చేస్తామని హామీ ఇచ్చారు. రైతులందరూ ఒకే పంట వేయడం వల్ల, డిమాండ్ తగ్గి గిట్టుబాటు ధర రాకుండా పోయే ప్రమాదాన్ని నివారించేందుకు క్రాప్ కాలనీలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. 500 జనాభా కలిగిన చిన్న గ్రామ పంచాయతీకి కూడా ఏడాదికి 8 లక్షల రూపాయల అభివృద్ధి నిధులు అందిస్తామని చెప్పారు. దీని ద్వారా భవిష్యత్తులో గ్రామ పంచాయతీలకు నిధుల కొరత అనే సమస్య లేకుండా చేస్తామన్నారు. త్వరలో దంత, చెవి, ముక్కు, గొంతు వ్యాధుల నివారణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.

అడుగడుగునా అభివృద్ధికై ఎన్నెన్నో పథకాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details