CM KCR Saddula Bathukamma 2023 Greetings: తెలంగాణవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు (Bathukamma Celebrations) జరిగాయి. ప్రజల జీవన విధానంలో నుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగని.. సీఎం కేసీఆర్ (KCR) అన్నారు. సబ్బండ వర్గాలు సమష్టిగా జరుపుకునే వేడుకగా పేర్కొన్నారు. నిమజ్జన సమయంలో స్వీయ జాగ్రత్తలతో పాటు.. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఆనందోత్సాహాలతో సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో వెన్నెపూల బతుకమ్మ సంబరాలు కన్నుల పండువగా జరిగాయి. లక్డీకపూల్‌లోని కలెక్టరేట్‌లో మహిళా ఉద్యోగులంతా ఒకచోట చేరి ఆటపాటలతో సందడి చేశారు. ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలలో.. ఉపాధ్యాయులు, విద్యార్థినులు కోలాటం, దాండియా ఆడారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
Bathukamma celebrations in Ireland : ఐర్లాండ్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురం
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పురపాలికలోని వినాయక గంజిలో బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా నిర్వహించారు. పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉద్యోగులంతా ఒక చోట చేరి ఆడిపాడారు. మౌలాలి జడ్‌ఆర్‌టీఐ రైల్వే ట్రైనింగ్ సెంటర్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థలో పనిచేస్తున్న మహిళలతో పాటు ట్రైనీలు కోలాటం, దాండియా ఆడి సందడి చేశారు. ప్రపంచంలో ప్రకృతిని ఆరాధించే ఏకైక సంస్కృతి తెలంగాణకే సొంతమని కొనియాడారు.
MLC Kavitha Participated Bathukamma Celebrations:రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బతుకమ్మ పండుగను అంతా ఆనందంగా చేసుకుంటున్నామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha ) అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పర్యటించిన కవిత పలుచోట్ల మహిళలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టపై ప్రతి ఏటా జరిగే సద్దుల బతుకమ్మ (Saddula Bathukamma) వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు.