తెలంగాణ

telangana

ETV Bharat / state

Cm Kcr With Ministers: పాలనాపరమైన మార్పులపై సీఎం కసరత్తు.. పలు పథకాలపై తీరుపై ఆరా - రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై సీఎం కేసీఆర్

Cm Kcr With Ministers: పాలనాపరమైన విషయాలు, చేయాల్సిన మార్పులపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, అవసరాలు, వివిధ పథకాల తీరుపై ఆరా మంత్రులతో చర్చించినట్లు సమాచారం. రైతుబంధు, విద్యుత్ సంబంధిత అంశాలపై ఎక్కువగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Cm Kcr With Ministers
పాలనాపరమైన విషయాలు, చేయాల్సిన మార్పులపై సీఎం కేసీఆర్ కసరత్తు

By

Published : Dec 17, 2021, 5:05 AM IST

Cm Kcr With Ministers: వరుస కార్యక్రమాలు, జిల్లాల పర్యటనల నేపథ్యంలో వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. పాలనాపరమైన విషయాలు, చేయాల్సిన మార్పులపై కసరత్తు చేస్తున్నారు. మంత్రులతో ఈ దిశగా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి సమాలోచనలు జరిపారు. ఆర్థిక, వ్యవసాయ, ఇంధన, ఆర్ అండ్ బీ శాఖ మంత్రులతో చర్చించినట్లు తెలిసింది. కేంద్రం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణ సహా వివిధ అంశాలపై సమాలోచనలు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

cm review on schemes: రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, అవసరాలు, వివిధ పథకాలు - కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన తీరుతో పాటు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. రైతుబంధు, విద్యుత్ సంబంధిత అంశాలపై ఎక్కువగా చర్చ జరిగినట్లు అనుకుంటున్నాయి. అవసరమైతే రైతుబంధుతో పాటు ఇతర పథకాల్లో చేయాల్సిన మార్పుల విషయమై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. మంత్రులు, అధికారుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నిర్ణయానికి రానున్నారు.

ABOUT THE AUTHOR

...view details