రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాలు, వరదలపై మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించనున్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు భవిష్యత్‌తో చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున.....సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలు తీసుకొని రావాల్సిందిగా ఆదేశించారు.
వరదలపై మధ్యాహ్నం 3గంటలకు సీఎం సమీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. ఆయా శాఖల పరిధిలో జరిగిన నష్టం వివరాలు, అంచనాలతో అధికారులు సమావేశానికి రావాలని సీఎం ఆదేశించారు.
వరదలపై సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 3గంటలకు సమీక్ష
ఈ భేటీకి మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్ రెడ్డి సహా సీఎస్, పలువురు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. భారీ వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితి, తీసుకుంటున్న పునరావాస చర్యలు, కేంద్రానికి పంపాల్సిన నివేదికలో పేర్కొనాల్సిన అంశాలపై సమావేశంలో ప్రధానంగా సమీక్షించనున్నారు.
ఇవీచూడండి:అప్పుడు ఆనందం నింపిన వాడే.. చివరికి కన్నీళ్లు మిగిల్చాడు