తెలంగాణ

telangana

ETV Bharat / state

రానున్న రోజుల్లో సమృద్ధిగా వర్షాలు..!

గత మూడు రోజులుగా వర్షాలు బాగా పడుతున్నాయని, ఇదే ఒరవడి కొనసాగితే సగటు వర్షపాతాన్ని అధిగమిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రాజెక్టుల్లోకి నీరు చేరడం ఆశాజనకంగా ఉందన్నారు. కాళేశ్వరంలోకి భారీగా నీరు చేరుతోందని పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లోకి నీరు, వర్షాల పరిస్థితిపై ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్ ఆదివారం సమీక్ష నిర్వహించారు.

By

Published : Jul 29, 2019, 7:56 AM IST

Updated : Jul 29, 2019, 9:17 AM IST

రానున్న రోజుల్లో సమృద్ధిగా వర్షాలు..!

రానున్న రోజుల్లో సమృద్ధిగా వర్షాలు..!

వచ్చే రెండు నెలలు సమృద్ధిగా వర్షాలు పడతాయని.. రాష్ట్రం ఈ ఖరీఫ్‌లో కరవు బారి నుంచి పూర్తిగా బయటపడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరుతుందని.. పంటలకు ఢోకా ఉండదనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ప్రాజెక్టుల్లోకి నీరు, వర్షాల పరిస్థితిపై ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సమీక్ష నిర్వహించారు. జలాశయాలవారీగా నీటిమట్టాల సమాచారాన్ని ఈ సందర్భంగా సీఎం తెలుసుకున్నారు. జిల్లాల వారీగా వర్షాల స్థితిగతులపై ఆరా తీశారు.

అన్నదాతల కష్టాలు తొలగిపోనున్నాయి..!
గత మూడు రోజులుగా వర్షాలు బాగా పడుతున్నాయని, ఇదే ఒరవడి కొనసాగితే సగటు వర్షపాతాన్ని అధిగమిస్తామని సీఎం చెప్పారు. ప్రాజెక్టుల్లోకి నీరు చేరడం ఆశాజనకంగా ఉందన్నారు. కాళేశ్వరంలోకి భారీగా నీరు చేరుతోందని.. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లోకి ఇప్పటికే 20 టీఎంసీలకుపైగా వచ్చాయని వివరించారు. వర్షాలు పడి ప్రాజెక్టుల్లో నీరు చేరి అన్నదాతల కష్టాలు తొలగిపోతాయన్నారు. కాళేశ్వరం మాదిరే ఇకపై పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై దృష్టిసారిస్తామని, ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగేలా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు.

కొత్త సచివాలయ నిర్మాణాలపై ఆరా
కొత్త సచివాలయం, శాసనసభ నిర్మాణం గురించి సీఎం ఆదివారం సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. సచివాలయ కొత్త నమూనాలను ఆయన పరిశీలించారని సమాచారం. సచివాలయం తరలింపు ఏర్పాట్ల గురించీ సమాచారం తీసుకున్నారు. సత్వరమే శాసనసభ నుంచి శాఖల తరలింపు పనులు చేపట్టాలని ఆదేశించారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో ఇక అన్ని జబ్బులకూ ఆరోగ్యశ్రీ..!

Last Updated : Jul 29, 2019, 9:17 AM IST

ABOUT THE AUTHOR

...view details