తెలంగాణ

telangana

ETV Bharat / state

నాందేడ్ సభలో బీఆర్​ఎస్ తీర్థంపుచ్చుకున్న మహారాష్ట్ర నేతలు

BRS Public Meeting: నాందేడ్​ బీఆర్​ఎస్​ సభలో పలువురు మహారాష్ట్ర నేతలు బీఆర్ఎస్​ గూటికి చేరారు. సభా ప్రాంగణానికి చేరుకున్న తరువాత కేసీఆర్ శివాజీ, అంబేడ్కర్​, పూలే విగ్రహాలకు పూల మాలలు వేశారు. అనంతరం మరాఠా నాయకులను గులాబీ కండువా కప్పి.. బీఆర్​ఎస్​లోకి ఆహ్వానించారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత, బీఆర్​ఎస్​ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్​ ఉన్నారు.

BRS
బీఆర్​ఎస్​

By

Published : Feb 5, 2023, 3:37 PM IST

Updated : Feb 5, 2023, 4:30 PM IST

BRS Public Meeting In Nanded at Maharashtra: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో శ్రీ గురు గోబింద్ సింగ్ ఎయిర్ పోర్ట్​కు బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ చేరుకున్నాక.. సీఎం కేసీఆర్​కు నాందేడ్​, తెలంగాణ నాయకులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా గురుద్వారాకు బయలుదేరి వెళ్లి అక్కడ ప్రార్థనలు చేసి.. సభాప్రాంగణమైన నాందేడ్​లోని సచ్​ఖండ్​బోడ్​ మైదానంలోని బీఆర్​ఎస్​ బహిరంగసభకు కేసీఆర్​ బయలుదేరారు. అక్కడ ఆయనకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

ముఖ్యమంత్రి వెంట ఎమ్మెల్సీ కవిత, బీఆర్​ఎస్​ ఆంధ్రప్రదేశ్​ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్​ కూడా విచ్చేశారు. సభావేదిక పైకి చేరుకున్న కేసీఆర్​.. శివాజీ, అంబేడ్కర్​, పూలే విగ్రహాలకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సమక్షంలో పలువురు మరాఠా నేతలు పార్టీలో చేరారు. వీరికి పార్టీ గులాబి కండువాలు కప్పి.. కేసీఆర్​ పార్టీలోకి ఆహ్వానించారు. మహిళా సర్పంచులకు ఎమ్మెల్సీ కవిత కండువాలను కప్పారు. తెలంగాణ వెలుపల బీఆర్​ఎస్​ సభ జరగడం నాందేడ్​లోనే ప్రథమం కావడం విశేషం. అయితే సభ అవ్వాల్సిన సమయం కంటే గంటసేపు ఆలస్యంగా ప్రారంభమైంది. సభ పూరైన తర్వాత సాయంత్రం మీడియా సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ రానున్నారని పార్టీ నేతలు వెల్లడించారు.

సీఎం కేసీఆర్​ సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరుతున్న మరాఠా నాయకులు

ఇవీ చదవండి:

Last Updated : Feb 5, 2023, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details