ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు స్వాగతం పలికేందుకు రాజ్‌భవన్‌కు వచ్చిన సీఎం కేసీఆర్... పలు అంశాలపై గవర్నర్‌తో చర్చించారు.
kcr: గవర్నర్ తమిళిసైతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ - telangana varthalu
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు స్వాగతం పలికేందుకు రాజ్‌భవన్ వచ్చిన ముఖ్యమంత్రి... పలు అంశాలపై గవర్నర్‌తో చర్చించారు. రాష్ట్రంలోని పరిస్థితులను గవర్నర్‌కు వివరించారు.
గవర్నర్ తమిళిసైతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, ప్రజారోగ్యం కోసం ప్రభుత్వ చర్యలు, ధాన్యం సేకరణ, వానాకాలం పంటల సాగు, ఆర్థిక పరిస్థితులు, రైతుబంధు సాయం, తదితర అంశాలను గవర్నర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: రాజ్‌భవన్‌లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఘనస్వాగతం