ఉపాధిహామీ, వ్యవసాయం, కరోనా నివారణ చర్యలు సహా ఇతర అంశాలపై చర్చించేందుకు మంగళవారం జరగనున్న సమావేశానికి జిల్లా కలెక్టర్లతో పాటు పంచాయతీ అధికారులు మాత్రమే పాల్గొననున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులకు సమాచారం పంపింది. మంగళవారం ఉదయం పదకొండున్నరకు జిల్లా కలెక్టర్లతో ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు.
కేసీఆర్ సమీక్షకు.. కలెక్టర్లు, పంచాయతీ అధికారులు మాత్రమే!
ప్రగతిభవన్‌లో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్... జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి పాలనాధికారులతో పాటు పంచాయతీ అధికారులు మాత్రమే హాజరుకానున్నారు.
మొదట కలెక్టర్లతోపాటు స్థానికసంస్థల అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈఓ, జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, వ్యవసాయ, అటవీ అధికారులు సమావేశానికి హాజరుకావాలని తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో సమావేశానికి హాజరయ్యే వారి సంఖ్యను తగ్గించారు. కలెక్టర్లతో పాటు పంచాయతీ అధికారులు మాత్రమే సమావేశానికి హాజరు కావాలని సీఎస్ సోమేశ్‌కుమార్ అధికారులకు తెలిపారు. ఉపాధిహామీ పనులు, వ్యవసాయం, కరోనా నివారణ చర్యలు సహా ఇతర అంశాలపై కలెక్టర్లు, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.
ఇవీ చూడండి: మరో తెరాస శాసన సభ్యుడికి కరోనా... గణేశ్ గుప్తాకు పాజిటివ్