తెదేపా సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు తెరాస తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మండవ వెంకటేశ్వరరావు నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు 2 గంటలపాటు సాగిన ఈ భేటీలో పార్లమెంట్ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇవాళ పాస్‌పోర్టు కార్యాలయంకు వెళ్లిన కేసీఆర్.. అక్కడి నుంచి మండవ ఇంటికి వెళ్లారు. ఈరోజు ఉదయమే మండవతో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, పువ్వాడ అజయ్ కుమార్ సమావేశమయ్యారు.
తెరాస తీర్థం పుచ్చుకోనున్న మండవ వెంకటేశ్వరరావు - PASSPORT OFFICR KCR
తెదేపా సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు కారెక్కాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 2 గంటల పాటు మండవ నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనతో భేటీ అయ్యారు.
తెరాస తీర్థం పుచ్చుకోనున్న మండవ వెంకటేశ్వరరావు