సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఈరోజు మరణించిన సంగతి తెలిసిందే. అయితే.. ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ములాయం జీవితాంతం బడుగు, బలహీన వర్గాల కోసమే పనిచేశారని కొనియాడారు. రాంమనోహర్ లోహియా వంటి నేతల స్ఫూర్తితో ములాయం రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. ములాయం కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది అంటూ ములాయం సింగ్ యాదవ్ మరణంపై మంత్రి కేటిఆర్ ట్విటర్‌లో స్పందించారు. కుమారుడు అఖిలేష్ యాదవ్‌కు, ఆయన కుటుంబసభ్యులకు. ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకులు, విధేయులందరికీ బలం చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని సంతాపం తెలిపారు.