తెలంగాణ

telangana

ETV Bharat / state

సచివాలయ పనులు పరిశీలించిన కేసీఆర్.. అధికారులు, ఇంజినీర్లకు పలు సూచనలు - నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన కేసీఆర్

CM KCR inspects New Secretariat Works: ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. సచివాలయ ప్రాంగణంలో గంటన్నరపాటు ఉన్న కేసీఆర్‌... పనుల గురించి ఇంజినీర్లను, అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు. దాదాపు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్తుల మేర భవనాన్ని నిర్మిస్తున్నారు.

CM KCR inspects New Secretariat Works
CM KCR inspects New Secretariat Works

By

Published : Nov 17, 2022, 5:35 PM IST

Updated : Nov 17, 2022, 8:59 PM IST

CM KCR inspects New Secretariat Works: సచివాలయ నిర్మాణ పురోగతిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించారు. సీఎం వెంట మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు. సచివాలయ ప్రాంగణంలో గంటన్నరపాటు ఉన్న కేసీఆర్‌... పనుల గురించి ఇంజినీర్లను, అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. ఇంటీరియ‌ర్ ప‌నులు ముమ్మరంగా కొన‌సాగుతున్నాయి. దాదాపు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్తుల మేర భవనాన్ని నిర్మిస్తున్నారు.

సచివాలయ నిర్మాణ కోసం సిబ్బంది, కార్మికులు... మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సుధీర్ఘకాలం రాష్ట్ర అవసరాలకు పనికొచ్చే విధంగా పటిష్ఠంగా నిర్మాణం చేస్తున్నారు. చాంబర్లు, ఇంటీరియర్‌ డిజైన్‌, ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌, కలరింగ్‌, ఫ్లోరింగ్‌, మార్బుల్స్‌, పోర్టికోల నిర్మాణం ఏకకాలంలో చేపడుతున్నారు. గ్రీన్‌ బిల్డింగ్‌ పద్ధతిలో సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. సహజంగా గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త సచివాలయానికి ఇప్పటికే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టారు. త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. భవనం లోపల కలియతిరిగిన సీఎం పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తయ్యేలా అధికారులు, ఇంజినీర్లకు సీఎం కేసీఆర్‌ పలు సూచనలు చేశారు. అనంతరం సచివాలయం నుంచి ముఖ్యమంత్రి అక్కడ నుంచి బయల్దేరి వెళ్లారు.

New Secretariat Inauguration in Telangana : తొలుత 6 లక్షల చదరపు అడుగు విస్తీర్ణంలో సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించినా ప్రస్తుతం అది 8.60 లక్షల చదరపు అడుగులకు చేరింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌ కాకుండా ఏడు అంతస్తులు నిర్మిస్తున్నారు. 2019 జూన్‌లో సచివాలయ నూతన భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. నమూనాలు సిద్ధమై తొలి స్లాబు వేసేందుకు 2021 జనవరి అయింది. కరోనా కారణంగా నాలుగు నెలల పాటు ఆశించిన స్థాయిలో పనులు జరగలేదు. ఆ తరవాత నుంచి పనుల వేగాన్ని పెంచారు. అన్ని అంతస్తుల్లోనూ పనులు ఒకేసారి జరిగేలా రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రణాళికను రూపొందించడంతో పాటు పనుల తీరు తెన్నులను రోజువారీగా సమీక్షిస్తున్నారు. త్వరలో భవన ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో అందజేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 17, 2022, 8:59 PM IST

ABOUT THE AUTHOR

...view details