రైతుబంధు పథకం నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వానాకాలం దృష్ట్యా తక్షణమే రైతులందరికీ రైతుబంధు అందజేయనున్ననట్లు చెప్పారు. ఈ వానాకాలం సీజన్‌కు ఇప్పటికే రూ.5,500 కోట్లు వ్యవసాయ శాఖకు బదిలీ చేసినందున తక్షణమే రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ప్రకటించారు. విడుదలకు సిద్ధంగా మరో రూ.1500 కోట్లు ఉన్నాయని తెలిపారు. రైతును రాజును చేయాలన్న కేసీఆర్ మొక్కవోని సంకల్పానికి ఇది తార్కాణమని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ సంకల్పానికి ఇది తార్కాణం: మంత్రి నిరంజన్‌రెడ్డి - రైతుబంధు పథకం
రైతుబంధు పథకం నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రైతును రాజును చేయాలన్న కేసీఆర్ మొక్కవోని సంకల్పానికి ఇది తార్కాణమని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ సంకల్పానికి ఇది తార్కాణం: మంత్రి నిరంజన్‌రెడ్డి
కరోనా విపత్తుతో దేశమంతా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నప్పటికీ... వ్యవసాయ రంగానికి రూ.7 వేల కోట్లు కేటాయించడం ప్రశంసనీయమన్నారు. దేశంలో వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. కేసీఆర్ ఆలోచనల మూలంగా ఆరేళ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం ఉజ్వలంగా మారిపోయిందని తెలిపారు. నియంత్రిత వ్యవసాయంతో అది మరింత మెరుగుపడనుందని.. ముఖ్యమంత్రికి తెలంగాణ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.