CM KCR Wishes to Governor: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం కేసీఆర్ గవర్నర్‌కు లేఖ పంపారు. రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్... ప్రజలకు చాలా సంవత్సరాల పాటు సేవ చేసేలా తమిళిసైని ఆశీర్వదించాలని భగవంతుణ్ని ప్రార్థించారు.
రాజ్‌భవన్, ప్రగతిభవన్ల మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. ఈ ఏడాది మార్చిలో శాసనసభ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగంతో ప్రారంభించాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై.. తెలంగాణకు గవర్నర్‌గా వచ్చినా తన పాత వాసనలను పోగొట్టుకోలేదని వ్యాఖ్యానించింది. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడంలోనే గవర్నర్‌తో అసలు సమస్య ఉందని.. ఉన్నత మర్యాదలను ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వంతో హఠాత్తుగా కయ్యం పెట్టుకున్నారని పేర్కొంది.