తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్​ పుట్టినరోజుకు మొక్కలు నాటండి - hyderabad today latest news

ఈనెల 17న సీఎం కేసీఆర్​ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని తెలంగాణ ఉద్యోగుల ఐకాస నేతలు కోరారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టిన హరితహారంతో అడవుల శాతం పెరిగిందన్నారు.

CM KCR birthday Plant the trees in telangana
సీఎం కేసీఆర్​ పుట్టినరోజుకు.. మొక్కలు నాటండి

By

Published : Feb 14, 2020, 2:25 PM IST

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈనెల 17న రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని తెలంగాణ ఉద్యోగుల ఐకాస నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారంతో రాష్ట్రం హరిత తెలంగాణగా మారిందన్నారు.

ఆరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి ఆదేశాలతో ఉద్యోగులు చేపట్టిన హరితహారంతో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికులు ఆ రోజున హరితహారం నిర్వహించి ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని కోరారు.

ఇదీ చూడండి :కేటీఆర్​ ఇచ్చిన హామీ నిలబెట్టుకునేనా?

ABOUT THE AUTHOR

...view details