తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు, అధికారులు మొక్కలు నాటి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ చోట్ల కేకు కోసి సంబురాలు చేసుకున్నారు. నూరేళ్లపాటు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

Cm KCR Birth Day Celebrations in Hyderabad city
భాగ్యనగంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

By

Published : Feb 17, 2020, 11:02 PM IST

తెలంగాణ భవన్​లో కేసీఆర్ జన్మదిన వేడుకలు తెరాస శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. తెరాస విద్యార్థి విభాగం నేతృత్వంలో కేక్ కట్ చేశారు. మంత్రి సత్యవతి రాఠోడ్, తదితరులు రక్తదానం చేశారు. హుస్సేన్ సాగర్​లోని బుద్ధుని విగ్రహం​ వద్ద తెలంగాణ ప్రైవేట్​ ఉద్యోగుల సంఘం కేక్ కట్ చేసి... పర్యటకులకు పంచి సంబరాలు జరుపుకున్నారు.

బేగంపేట పీఎస్ ఆవరణలో ఉత్తర మండల డీసీపీ కలమేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు. మొక్కలను విరివిగా నాటడం వల్ల నగరంలోని కాలుష్యాన్ని కొంతమేర తగ్గించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. నగర శివారులోని మణికొండ వృద్ధాశ్రమంలో కృషి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేసీఆర్ వెయ్యేళ్లు బతికితే మాలాంటి అనాధ వృద్ధులు ఎంతోమంది బాగుపడతారని సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి కొడుకు అందరికీ ఉంటే దేశం ఎంతో బాగుపడుతుందని వృద్ధులు ఆశించారు.

భాగ్యనగంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

ఇవీచూడండి:ుూ'ట్రిపుల్​ ఐ' నినాదంతో ముందుకెళ్తున్నాం: కేటీఆర్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details