సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.. తన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. తమ సంస్థ కోనేరు చారిటబుల్ ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను విరించారు. ప్రతి రోజు వెయ్యి మందికి అన్నదానం, స్కూళ్లకు టీవీలు అందించడం, వివిధ పరీక్షలకు హాజరయ్యే వారికి ఉచితంగా శిక్షణ, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, రక్తహీనత ఉన్న మహిళలకు పోషకాహారం ఇవ్వడం, ఎస్సీ-ఎస్టీలకు సామూహిక వివాహాల నిర్వహణ లాంటి కార్యక్రమాలతో కోనప్ప అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని సీఎం అన్నారు.
కోనప్ప... బాగా చేస్తున్నావయ్యా: సీఎం కేసీఆర్ - సీఎం కేసీఆర్ వార్తలు
వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. కుటుంబ సభ్యులతో పాటు కోనప్ప హైదరాబాద్ ప్రగతిభవన్లో సీఎంను కలిశారు.
కోనప్ప బాగా చేస్తున్నావయ్యా: సీఎం కేసీఆర్
నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్నందుకు కేసీఆర్కు కోనప్ప కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:పళ్లు తోముతూ టూత్ బ్రష్ మింగేశాడు