తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Fire On BJP భాజపా ముక్త్‌ భారత్‌ కోసం కలిసి పనిచేస్తాం: కేసీఆర్‌ - నితీశ్ కుమార్‌తో కేసీఆర్ భేటీ

CM KCR and CM Nithish Kumar Meeting on National Politics
CM KCR and CM Nithish Kumar Meeting on National Politics

By

Published : Aug 31, 2022, 4:25 PM IST

Updated : Aug 31, 2022, 7:45 PM IST

16:23 August 31

CM KCR Fire On BJP 8 ఏళ్ల మోదీ పాలనలో దేశం పూర్తిగా నష్టపోయింది: కేసీఆర్‌

CM KCR Fire On BJP: భాజపా వ్యతిరేక శక్తులు ఏకం కావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. భాజపా ముక్త్‌ భారత్‌ కోసం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. భాజపా పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా ముక్త్‌ భారత్‌ కోసం కలిసి రావాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ను కోరినట్లు తెలిపారు. పట్నాలో నితీశ్​కుమార్​తో భేటీ అనంతరం కేసీఆర్​ మీడియాతో మాట్లాడారు. నీతీశ్‌ కూడా భాజపా ముక్త్‌ భారత్‌ కోరుకుంటున్నారని కేసీఆర్‌ వెల్లడించారు. ప్రపంచ దేశాల ముందు దేశ పరువు తీస్తున్నారని కేసీఆర్​ మండిపడ్డారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు హామీ ఏమైంది. భాజపా వ్యతిరేక శక్తులు ఏకం కావాలి. రొటీన్‌ ప్రభుత్వాలు వద్దు.. భారత్‌ను మార్చే ప్రభుత్వం రావాలి. భాజపా పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయింది. అబద్ధాలతో పాలన సాగిస్తున్నారు. విపక్షాలను ఏకం చేసే విషయమై నీతీశ్‌తో చర్చించా. విద్వేషాలు సృష్టించే శక్తులు దేశానికి క్షేమకరం కాదు. చైనాతో పోల్చితే మనం ఎక్కడ ఉన్నాం. విద్వేషం పెరిగితే దేశానికి నష్టం. ప్రతిష్ఠాత్మక సంస్థ ఎల్‌ఐసీని ప్రైవేటీకరణ చేస్తారా?. రైల్వేలు, ఎయిర్‌పోర్టులు అన్నీ ప్రైవేటీకరిస్తారా?. రైతుల ఆదాయం రెట్టింపు చేశారా?.భాజపా ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిందే. రూపాయి ఈ స్థాయిలో ఎన్నడూ పతనం కాలేదు. సమృద్ధిగా జలాలు ఉన్నా జల యుద్ధాలు ఆగట్లేదు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. దేశ ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వట్లేదు. దిల్లీలోనూ తాగునీరు, విద్యుత్‌ సమస్య పరిష్కరించలేదు. ధరలు పెరిగి.. పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.- కేసీఆర్‌, సీఎం

దేశ ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రధాని మోదీ సర్కార్ ఉందని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. భాజపా పాలనలో దేశం ఏ రంగంలోనూ అభివృద్ధి సాధించలేదని మండిపడ్డారు. మోదీ సర్కారును ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశంలోని నదుల్లో 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉందని తెలిపారు. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశం పూర్తిగా నష్టపోయిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనమైందని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, పేదలు, మహిళలు ఏ ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని కేసీఆర్‌ మండిపడ్డారు.

ధరలు పెరిగి.. పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో వనరులు సమృద్ధిగా ఉన్నా.. వినియోగించుకోవట్లేదని తెలిపారు. బేటీ బచావో-బేటీ పఢావో నినాదం ఉన్నా.. అత్యాచారాలు ఆగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారని భాజపాను ప్రశ్నించారు. భాజపా ప్రభుత్వం మంచిచేస్తే రైతులు ఎందుకు ఉద్యమిస్తారని కేంద్రాన్ని నిలదీశారు. మంచి దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదం పేరుకు మాత్రమేనని.. వస్తువులు ఇతర దేశాల నుంచి దిగుమతి చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. అమెరికా ఎన్నికలంటే అహ్మదాబాద్‌ కార్పొరేషన్ ఎన్నికలా? అని ఎద్దేవా చేశారు.

భాజపాకు వ్యతిరేకంగా అందరం ఏకతాటిపై ఉన్నామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఎన్నికల వేళ నిర్ణయిస్తామని తెలిపారు. విస్తృత చర్చల ద్వారా నాయకత్వంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు మోటార్లు కాలిపోయేవని.. జనరేటర్లతో వ్యాపార, వాణిజ్య సంస్థలు నడిచేవని కేసీఆర్‌ వెల్లడించారు. కఠోర శ్రమ ద్వారా విద్యుత్‌ సమస్య పరిష్కరించుకున్నామని తెలిపారు. లోపభూయిష్టమైన విద్యుత్‌ విధానాన్ని రాష్ట్రాలపై రుద్దాలని కేంద్రం యత్నిస్తోందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం నీతీశ్‌ పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు. భాజపాను పారద్రోలితేనే దేశం ప్రగతి పథంలోకి దూసుకెళ్తుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. నీతీశ్‌కుమార్‌ దేశంలోనే సమర్థవంతమైన నేత కొనియాడారు. భాజపాను వ్యతిరేకించే ప్రతి ఒక్కరితో కలిసి నడుస్తామని.. గుజరాత్‌ నమూనా విఫలమైందని సీఎం కేసీఆర్‌ అన్నారు. విఫలమైన గుజరాత్‌ నమూనా దేశానికి అవసరమా? అని ప్రశ్నించారు. గుజరాత్‌లో తాగునీరు, విద్యుత్‌ సమస్య ఉందని వెల్లడించారు.

లాలూప్రసాద్ యాదవ్‌ను పలకరించిన కేసీఆర్‌:బిహార్‌ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్‌ను సీఎం కేసీఆర్‌ కలిశారు. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నివాసానికి వెళ్లిన సీఎం ఆరోగ్యంపై ఆరా తీశారు. లాలూ ఆరోగ్యం, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Last Updated : Aug 31, 2022, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details