తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీజీ ఆశయాల వెలుగులో ముందుకు సాగుదాం : సీఎం కేసీఆర్ - మహాత్మా గాంధీ వర్ధంతి

CM KCR about Mahatma Gandhi : జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఆయణ్ను స్మరించుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. గాంధీజీ ఆశయాల వెలుగులో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. గాంధీ ఆదర్శాలు భారతదేశానికి తక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు.

CM KCR
CM KCR

By

Published : Jan 30, 2023, 6:53 AM IST

Mahatma Gandhi Death Anniversary : కుల, మత, వర్గాలకు అతీతంగా సర్వజనుల హితమే తన మతమని చాటిన మహాత్మా గాంధీ ఆదర్శాలు భారతదేశానికి తక్షణ అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపితను స్మరించుకున్నారు. దేశ సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు తన జీవితాన్ని అర్పించిన మహాత్మా గాంధీ.. భారత పురోగమనానికి సదా ఓ దిక్సూచీలా నిలుస్తారని సీఎం పేర్కొన్నారు.

CM KCR about Mahatma Gandhi : నమ్మిన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలను లెక్క చేయకుండా... ఒక్కొక్కటి అధిగమిస్తూ విజయ తీరాలకు చేరాలనే స్పూర్తిని.. గాంధీ జీవితం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సి ఉందన్నారు. గాంధీజీ ఆశయాల వెలుగులో ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నేటి యువత గాంధీ ఆశయాలకనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details