తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం : ఏపీ సీఎం - మహిళా దినోత్సవం తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని ఆ రాష్ట్ర సీఎం జగన్​ అన్నారు. మహిళా సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం అనేక పథకాలు తెచ్చిందని చెప్పారు. 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' సందర్భంగా జగన్​ శుభాకాంక్షలు తెలిపారు.

CM JAGAN
అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం: జగన్

By

Published : Mar 8, 2021, 8:34 AM IST

'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' సందర్భంగా రాష్ట్ర మహిళలకు ఏపీ సీఎం జగన్​ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని కొనియాడారు. స్త్రీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.

వైకాపా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అనేక పథకాలు తెచ్చింది జగన్ గుర్తు చేశారు. అమ్మ ఒడి, వైఎస్‌ఆర్ చేయూత, ఆసరా, కాపు నేస్తం పథకాలు తెచ్చామని తెలిపారు. మహిళల పేరుతో ఇంటిపట్టాలు ఇచ్చామని.. సంపూర్ణ పోషణ, నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించామన్నారు. దిశ చట్టం, కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టులు తెచ్చామని జగన్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details