CM Jagan Review: పన్ను అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఆదాయార్జన శాఖలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం.. పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సౌలభ్యం చేయాలన్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు అప్‌గ్రేడ్ చేయాలని, నిరుపయోగంగా ఉన్న మైనింగ్ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలన్నారు. గతంతో పోలిస్తే, మద్యం అమ్మకాలు తగ్గాయని సీఎం అన్నారు.
గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిన మద్యం అమ్మకాలు: సీఎం జగన్ - పన్ను అక్రమార్కులపై ఫోకస్
CM Jagan Review: ఏపీలో ఆదాయార్జన శాఖలపై సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మద్యం, మైనింగ్, గంజాయితో పాటు పలు అంశాలపై అధికారులతో చర్చించారు. ముఖ్యంగా పన్ను అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ ఆదేశించారు.
బెల్టుషాపుల తొలగింపు, పర్మిట్ రూమ్‌ల రద్దు సహా ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల నియంత్రణ చర్యల వల్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గిందని సీఎం చెప్పుకొచ్చారు. అక్రమ మద్యం తయారీ, అమ్మకాలపై స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సీఎం సూచించారు, గంజాయి, అక్రమ మద్యం కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఏజెన్సీలో గంజాయి నివారణ చర్యలు కొనసాగిస్తూనే.. అక్కడ కూడా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు కల్పించాలని సూచించారు.
ఇవీ చదవండి: