అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఏపీ సీఎం ఆదేశం - అంతర్వేది రథం ఘటన
అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు కోరుతూ... హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ పంపింది. దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ శుక్రవారం జీవో వెలువడే అవకాశం ఉంది.
అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సీఎం నిర్ణయం