ప్రజాస్వామ్య ఆశాకిరణం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ సాయంత్రం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. తెలుగు వ్యక్తి అత్యున్నత స్థానానికి ఎదగడం పట్ల తనకు గర్వంగా ఉందని పేర్కొన్నారు.
BHATTI: దేశ అత్యున్నత న్యాయపీఠంపై తెలుగు వ్యక్తి ఉండడం గర్వకారణం: భట్టి - సీజేఐని కలిసిన భట్టి విక్రమార్క
తెలుగు వ్యక్తి దేశ అత్యున్నత న్యాయపీఠాన్ని అధిరోహించడం గర్వంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ సాయంత్రం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా సీజేఐ ఎన్వీ రమణను ఆయన కలిశారు.
సీజేఐ ఎన్వీ రమణను కలిసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
దేశంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో వాటిని చక్కబెట్టే ఆశాకిరణంలా సీజేఐ ఎన్వీ రమణ కనిపిస్తున్నారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడేందుకు ఎన్వీ రమణ కృషి చేస్తారని తెలిపారు.