కేంద్ర ప్రభుత్వ చట్టాలపై గతంలో సభలో చర్చించామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శాససనభ సమావేశాల్లో పేర్కొన్నారు. రైతుల ఆందోళనలపై సభలో చర్చించి... కేంద్ర ప్రభుత్వ చట్టాలపై తీర్మానం కూడా చేయాలని ప్రతిపాదించారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా సభలో తీర్మానం చేయాలి: భట్టి
సాగు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. రైతు ఆందోళనలపై సభలో చర్చిద్దామని తెలిపారు.
రాష్ట్రంలో పండించిన పంటలను ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేశారని తెలిపారు. ఇప్పుడు ఆ సెంటర్లు ఎత్తివేసిన పక్షంలో అవసరమైతే కేంద్రంతో యుద్ధం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని సభలో గుర్తు చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సభలో తీర్మానం చేయాలని సూచించారు. పంజాబ్, కేరళ అసెంబ్లీల్లో కూడా తీర్మానాలు చేశారని ఈ సందర్భంగా తెలిపారు. సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సీఎంను కోరుతున్నట్లు చెప్పారు. భాజపాయేతర రాష్ట్రాల్లో ఎలా తీర్మానం చేశారో అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని భట్టి కోరారు.
- ఇదీ చదవండి :నోములకు సంతాపం తెలిపిన మండలి