తెలంగాణ

telangana

ETV Bharat / state

'శాసనసభ, హైకోర్టు, ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి' - 'శాసనసభ, హైకోర్టు, ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి'

ప్రభుత్వం తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాజ్యంగపై ఏమాత్రం గౌరవమున్నా... శాసనసభ, హైకోర్టు, ప్రజలకు సీఎం కేసీఆర్​ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

CLP LEADER BATTI VIKRAMARKA DEMANDED CM KCR TO SAY SORRY TO HIGH COURT

By

Published : Nov 7, 2019, 4:44 PM IST

'శాసనసభ, హైకోర్టు, ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి'

సీఎం కేసీఆర్‌కు రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం ఉన్నా... శాసనసభ, హైకోర్టు, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. శాసనసభకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందనే అంశాన్ని గతంలోనే చెప్పామని... ఆర్టీసీ విషయంలో హైకోర్టు కూడా అదే చెప్పిందని భట్టి పేర్కొన్నారు. ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరు ప్రమాదకరంగా ఉందన్నారు. ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అమ్మితే సహించేది లేదని హెచ్చరించారు. ఉద్యమించి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. సభాహక్కుల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు నోటీసు ఇస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 9న చేపట్టనున్న 'ఛలో ట్యాంక్‌బండ్‌'కు కాంగ్రెస్​ సంపూర్ణ మద్దతు ఇస్తుందని భట్టి వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details