జనాల మాటలనే పాటలుగా మలిచి... సప్తసముద్రాల ఆవల ఉన్న వారిని సైతం చిందేయిస్తోన్న జానపద రచయిత క్లెమెంటో. 32 ఏళ్లుగా వేల పాటలతో జనాలను హోరెత్తిస్తోన్న ఆయన... డాక్టర్ సినారే ప్రోత్సాహమే తన పాటలకు స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపారు. మాయదారి మైసమ్మ పాట తన జీవితానికి దారి చూపిందని చెబుతోన్న క్లెమెంటో... డీజేల వల్ల జానపద పాటల స్వరూపం మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే 5 వేల పాటల క్లబ్లో చేరబోతున్న స్పాట్ రైటర్... క్లెమెంటోతో ఈటీవీ భారత్ ప్రతినిధి సతీశ్ ముఖాముఖి.
32 ఏళ్లుగా.. వేల పాటలు రాసి అలరిస్తోన్న క్లెమెంటో - clemento
ఆయన పాట పాడితే మనోళ్లే కాదు... పక్క దేశంలోనున్న కుర్రకారు సైతం ఊగిపోతుంటారు. క్యాసెట్ల కాలం నుంచి డీజేల దాకా వేల జానపద గేయాలు రాస్తున్న వ్యక్తి... అతనే మాయదారి మైసమ్మ పాట రచయిత క్లెమెంటో.
అలరిస్తోన్న క్లెమెంటో