తెలంగాణ

telangana

ETV Bharat / state

రేవంత్​రెడ్డి హిందీపై నిర్మలా సీతారామన్ కామెంట్.. లోక్​సభలో రగడ! - Lok Sabha meetings

Clash between Revanth and Nirmala: పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు లోక్​సభలో సజావుగా సాగుతుండాగా ఈరోజు కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​ రెడ్డి అడిగిన ప్రశ్నపై సభలో గందరగోళం చోటుచేసుకుంది. ఈ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​, రేవంత్​రెడ్డికి మధ్య సభలో స్వల్ప వాదోపవాదం జరిగింది.

Clash between Revanth and Nirmala
Clash between Revanth and Nirmala

By

Published : Dec 12, 2022, 7:54 PM IST

Clash between Revanth and Nirmala: రూపాయి పతనంపై లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నపై గందరగోళం చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి హిందీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు.. తిరిగి రేవంత్ రెడ్డి అభ్యంతరంపై సభలో స్వల్ప వాదోపవాదం జరిగింది. డాలర్ తో పోలిస్తే రూపాయి పతనాన్ని అడ్డుకోవడంలో మోదీ సర్కార్ విఫలమైందన్న రేవంత్.. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న సమయంలో చేసిన ప్రకటనను ప్రస్తావించారు.

దీనిపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. రికార్డు స్థాయిలో రూపాయి పతనంతో పాటు స్వాతంత్య్ర భారత్​లో మోదీ హయాంలోనే అత్యధికంగా అప్పులు చేశారని విమర్శించారు. యూపీఏ హయాం కంటే కొవిడ్ విపత్తు, రష్యా-యుక్రెయిన్ యుద్ధాన్ని తట్టుకుని భారత్ వృద్ధిరేటులో పరుగులు తీస్తోందని తెలిపారు. హిందీపై నిర్మల వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందనపై స్పీకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. జాతి, కులమతాల ప్రస్తావనను సభలో తేవద్దని పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

లోక్​సభలో రేవంత్​, నిర్మల్​ మధ్య మాటల యుద్ధం.. స్పీకర్​ చోరవతో..

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details