మా కుటుంబంలో నేనే ఫస్ట్
నాన్న ఎస్బీఐ ఉద్యోగి. అమ్మ శారీ బొటిక్ నిర్వహిస్తారు. సోదరి ఓ అంకుర సంస్థ నడుపుతున్నారు. నేను లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివాను. గోకరాజు ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివాను. డెల్లాయిట్‌లో ఆరు నెలల ఉద్యోగం చేశాను. మా కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరూ సివిల్ సర్వీసుల్లో లేరు. మొదటగా సాధించినందుకు సంతోషంగా ఉంది.
క్రికెటర్ అవుదామనుకున్నా
క్రికెట్ అంటే చాలా ఇష్టం. అండర్ 19లో హైదరాబాద్ తరఫున ఆడాను. క్రికెటర్ కాకపోతే సివిల్స్ రాయాలని నాన్న ప్రోత్సహించారు. మొదటి సారి క్రికెట్ కొనసాగిస్తూనే సివిల్స్ రాశాను. ఫెయిలయ్యాను. దీంతో క్రికెట్ వదిలిపెట్టి పూర్తిగా సివిల్స్‌కు కేటాయించాను. మూడు సార్లు ఫెయిలయ్యాను. అయినా నిరుత్సాహ పడలేదు. నువ్వు చేయగలవంటూ అమ్మ, నాన్న, సిస్టర్, కోచింగ్ సంస్థ నిర్వాహకురాలు బాలలత ప్రోత్సహించారు.