కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. కూర్చున్న చోటే దరఖాస్తు చేసుకునేలా.. అనుమతులకు సంబంధించిన ఉత్తర్వులను సైతం ఆన్‌లైన్‌లోనే ప్రింట్ అవుట్ తీసుకునేలా డైరెక్ట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం(డీపీఎంఎస్) పేరిట హెచ్‌ఎండీఏ కొంగొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది.
కొన్నేళ్ల నుంచి లేఅవుట్లు, భవన నిర్మాణ, ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్(సీఎల్‌యూ), ల్యాండ్ యూజ్, ఎన్‌వోసీలు, ఆక్యూపెన్సీ ధ్రువీకరణ పత్రాలను ఈ విధానంలోనే జారీ చేస్తున్నారు. అనుమతుల రూపేణా ప్రతినెలా సగటున రూ.50 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది.
సాంకేతిక సమస్యలు
లాక్‌డౌన్ ఎత్తేయడంతో దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. దరఖాస్తు చేసే క్రమంలో ధ్రువీకరణ పత్రాలు(ఫైల్స్), ఆ తర్వాత షార్ట్ ఫాల్స్ అప్‌లోడ్ కావడం లేదు. రిజిస్ట్రేషన్ విలువ నమోదు చేయగానే స్క్రీన్‌పై ఫీజు వివరాలు కనిపించడం లేదు. డ్రాఫ్ట్ లేఅవుట్ ఉత్తర్వులు రావడం లేదు.
నిబంధనల ప్రకారం దరఖాస్తులు జేపీఏవో నుంచి ఏపీవోకు, ఏపీవో నుంచి పీవోకు, పీవో నుంచి ప్లానింగ్ డైరెక్టర్, డైరెక్టర్ నుంచి కమిషనర్‌కు వెళ్లాలి. కానీ.. కిందిస్థాయిలో పరిశీలన పూర్తి కాకుండానే నేరుగా(జంప్) ఉన్నతాధికారులకు వెళ్లిపోతున్నాయి. మళ్లీ ఉన్నతాధికారులు తిప్పి పంపించాల్సి వస్తుంది.
ఎందుకిలా..?
ఒకప్పటితో పోలిస్తే డీపీఎంఎస్‌లో సాంకేతిక సమస్యలు పెరిగాయనే చెప్పొచ్ఛు ఈ సాఫ్ట్‌వేర్ నిర్వహణ బాధ్యతను పుణేకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ సంస్థకు అప్పగించారు.