Raana Visit T Hub: ఒక నగరం సినీ తారలు, క్రీడాకారులతో కాకుండా.. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో మంచి గుర్తింపు లభిస్తుందని యువ నటుడు దగ్గుబాటి రానా అన్నారు. అందుకు నిదర్శనమే మన హైదరాబాద్ మహానగరమని పేర్కొన్నారు. టి-హబ్ 2 కీ నోట్ సెషన్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రానా... స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
బిజినెస్ అనేది సవాళ్లతో కూడుకున్నది. టి హబ్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. నగరంలో పారిశ్రామిక వేత్తలే కీలకం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి.. మంత్రి కేటీఆర్‌కు కంగ్రాట్యులేషన్స్. బిలియన్ డాలర్స్ పెట్టుబడులు హైదరాబాద్‌కు వస్తున్నందుకు చాలా సంతోషం. - రానా దగ్గుబాటి, నటుడు
ప్రతి ఒక్కరూ పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఎంచుకునే మార్గం కూడా ఎంతో కీలకమన్న రానా తెలిపారు. టి-హబ్ బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. మరోవైపు ఈ సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి కేసిఆర్ టి-హబ్ 2ను ప్రారంభించనుండటంతో ప్రాంగణమంతా ఐటీ దిగ్గజాలు, అంకుర సంస్థలతో సందడిగా మారింది.