తెలంగాణ

telangana

ETV Bharat / state

'భారత సిమెంట్​ రంగం స్వయం సమృద్ధిగా ఉంది'

సీఐఐ, సీఎంఏ సంయుక్తంగా ఆన్​లైన్‌లో మొదటి సారిగా నిర్వహిస్తోన్న 3 రోజుల 16వ గ్రీన్ సిమెంట్ టెక్ 2020 కాన్ఫరెన్స్‌ గురువారం ప్రారంభమైంది. భారత సిమెంట్ రంగం ఇప్పటికే స్వయం సమృద్ధిగా ఉందని సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ పేర్కొంది.

cement
'భారత సిమెంట్​ రంగం స్వయం సమృద్ధిగా ఉంది'

By

Published : Jun 25, 2020, 10:48 PM IST

Updated : Jun 25, 2020, 11:36 PM IST

భారత సిమెంట్ రంగం ఇప్పటికే స్వయం సమృద్ధిగా ఉందని సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఛైర్మన్​, దాల్మియా సిమెంట్ ఎండీ, సీఈఓ.. మహేంద్ర సింగి తెలిపారు. భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ), సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సీఎం‌ఏ) సంయుక్తంగా మొదటి సారిగా ఆన్​లైన్‌లో నిర్వహిస్తోన్న మూడు రోజుల 16వ గ్రీన్ సిమెంట్ టెక్ 2020 కాన్ఫరెన్స్‌ గురువారం హైదరాబాద్​లో ప్రారంభమైంది.

ప్రభుత్వ మద్దతుతో పాటు సరైన విధానాల వల్ల భవిష్యత్​లో సిమెంటు ఉత్పత్తి పెంచుకోగలదన్నారు. వచ్చే 20 ఏళ్లలో అర్బనైజేషన్ రెట్టింపు అవుతుందన్నారు. దీనివల్ల హౌసింగ్, మౌలిక సదుపాయాలు, సిమెంట్ వినియోగంలో డిమాండ్ మరింత పెరుగుతుందని సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ ఆసియా సారథి లఫర్గీ హోల్సిమ్ వ్యాఖ్యానించారు.

ఇవీ చూడండి:రాష్ట్రానికి కేంద్రం జీఎస్టీ నష్ట పరిహారం చెల్లించేనా?

Last Updated : Jun 25, 2020, 11:36 PM IST

ABOUT THE AUTHOR

...view details