తెలంగాణ

telangana

ETV Bharat / state

మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు - మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో సీఐడీ దాడులు

CID Raids in Hyderabad today : హైదరాబాద్​లోని మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అమరావతి భూముల కొనుగోలు అంశంలో ఏపీ సీఐడీ సోదాలు జరుపుతోంది. కూకట్​పల్లి, కొండాపూర్​, గచ్చిబౌలిలోని ఇళ్లలో దాడులు కొనసాగిస్తున్నారు.

cid
సీఐడీ

By

Published : Feb 24, 2023, 10:31 AM IST

Updated : Feb 24, 2023, 11:17 AM IST

CID Raids At Former AP Minister Narayana Daughter House: హైదరాబాద్‌లోని మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో అక్కడ .. నారాయణ భూములు అక్రమంగా కొనుగోలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులోనే ఆయన కుమార్తె ఇంట్లో ఇవాళ సీఐడీ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్​లోని కూకట్​పల్లి, కొండాపూర్​, గచ్చిబౌలిలోని ఆమె ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.

అసలేం జరిగింది: అయితే గతంలో నెల్లూరులోని టీడీపీ సీనియర్​ నేత, మాజీ మంత్రి నారాయణ ఇంట్లో కూడా అమరావతిలో అసైన్డ్​ భూములు కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన సీఐడీ సోదాలు నిర్వహించింది. గేటు వేసి మరీ ఎవరినీ లోపలికి రానీకుండా ఈ సోదాలు కొనసాగించడం అప్పట్లో ఎన్నో అనుమానాలకు దారితీసింది. అమరావతిలో అసైన్డ్​ భూములు కొనుగోళ్లు అమ్మకాలకు సంబంధించి మూడు సంవత్సరాల క్రితమే సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది.

రాజధానిలో అసైన్డ్​ భూములు కొనుగోలు కేసు:ఏపీలోని రాజధాని అసైన్డ్​ భూముల వ్యవహారంలో సీఐడీ గతంలో సీఐడీ ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. అమరావతిలో 1100 ఎకరాల అసైన్డ్​ భూములలో అక్రమాలు జరిగాయని సీఐడీ అభియోగం మోపింది. అదే ప్రాంతంలోని వేర్వేరు గ్రామాల్లో 89.9 ఎకరాల అసైన్డ్​ భూములను కొన్నారని పేర్కొంది. ఇలా వేర్వేరు సర్వే నంబర్లలోని అసైన్డ్​ భూములు మాజీ మంత్రి నారాయణ, ఆయన బంధువులు, తెలిసినవారి పేర్లతో కొనుగోలు చేశారని ఆరోపించారు. వీరి అందరిపై రాజధాని ప్రాంతంలో ఉన్న సీఐడీ స్టేషన్​లో ఐపీసీలోని వివిధ సెక్షన్ల, అవినీతి నిరోధక చట్టం సెక్షన్​ కింద కేసులు నమోదు చేశారు. అయితే తాజాగా మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 24, 2023, 11:17 AM IST

ABOUT THE AUTHOR

...view details