తెలంగాణ

telangana

By

Published : Apr 28, 2020, 11:47 AM IST

ETV Bharat / state

తమిళ సరి... హద్దు గోడలు కూలాయి మరి!

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా చొరవతో అంతర్రాష్ట్ర సరిహద్దులో నిర్మించిన గోడను జిల్లా అధికారులు కూల్చివేయించారు.

chittoor-district-officials-who-demolished-the-walls-built-along-the-tamil-nadu-border
తమిళ సరి... హద్దు గోడలు కూలాయి

ఏపీ, తమిళనాడు సరిహద్దులో నిర్మించిన గోడను... చిత్తూరు జిల్లా అధికారులు కూల్చివేయించారు. పలమనేరు నుంచి రాకపోకలను నియంత్రించేలా... తమిళనాడు రాష్ట్రంలోని గుడియాత్తం సమీపంలోని సైనిగుంట వద్ద... పొరుగు రాష్ట్రం అడ్డుగోడ నిర్మించింది. ఈ విషయంపై స్పందించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా.... రైతుల సమస్యలపై తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కలెక్టర్​తో చర్చించారు. సానుకూల స్పందన రావడంతో... గోడ తొలగించి రైతుల రాకపోకలు పునరుద్ధరించాలని.... స్థానిక అధికారులను ఆదేశించారు. గుడియాత్తం తహసీల్దార్ తమ సిబ్బందితో కలిసి... గోడను కూల్చివేయించారు.

ABOUT THE AUTHOR

...view details