తెలంగాణ

telangana

ETV Bharat / state

చిరంజీవి పుట్టినరోజున రక్తదానం చేద్దాం... రండి - మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్​లోని సంధ్య థియేటర్​లో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా రక్తదాన అన్నదాన  శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. యువత నుంచి విశేషంగా ఈ కార్యక్రమాలకు స్పందన లభిస్తోంది.

చిరంజీవి పుట్టినరోజుకు రక్తదానం చేద్దాం తమ్ముల్లూ!!

By

Published : Aug 19, 2019, 4:43 PM IST

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉపయోగపడాలనే ఆశయంతో రక్తదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామినాయుడు తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్​లోని సంధ్య థియేటర్​లో కొణిదెల యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. చిరంజీవి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని వేలాది మంది యువత రక్తదానం చేయడానికి ముందుకొస్తున్నారని తెలిపారు. హైదరాబాద్​లో జరిగిన రక్తదాన శిబిరానికి యువత నుంచి విశేష స్పందన లభించింది.

చిరంజీవి పుట్టినరోజుకు రక్తదానం చేద్దాం !!

ABOUT THE AUTHOR

...view details