తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR convoy: సీఎం కాన్వాయ్‌కి అడ్డువెళ్లిన పిల్లలు.. పోలీసులను ఉరుకులు పెట్టించి..

సీఎం కాన్వాయ్‌కి పిల్లలు అడ్డువెళ్లారు. చోరీ చేసిన బైకుతో రాంగ్‌రూట్‌లో ప్రయాణం చేస్తూ.. సీఎం కాన్వాయ్​కు ఎదురుగా వెళ్లారు. వారిని పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Children obstructed the CM KCR convoy in Hyderabad
CM KCR convoy: సీఎం కాన్వాయ్‌కి అడ్డువెళ్లిన పిల్లలు

By

Published : Aug 8, 2021, 6:37 AM IST

ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు ఇద్దరు పిల్లలు ద్విచక్ర వాహనంతో అడ్డుగా వెళ్లి పోలీసులను ఉరుకులు పెట్టించారు. శనివారం సాయంత్రం ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఈ ఘటన జరిగింది. సచివాలయ నిర్మాణ పనుల్ని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌ వస్తుండగా పోలీసులు ఎన్టీఆర్‌ మార్గ్‌లో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో 11, 14 ఏళ్ల పిల్లలిద్దరు ఓ బైకుపై తెలుగుతల్లి కూడలి వైపు నుంచి సీఎం వచ్చే దారిలో రాంగ్‌రూట్‌లో వెళ్లారు. పోలీసులు పట్టుకునేలోపు వేగంగా ముందుకు వెళ్లారు.

ఇదే సమయంలో సీఎం కాన్వాయ్‌, వీరి వాహనం ఎదురెదురుగా వచ్చాయి. వెంటనే పోలీసులు పిల్లలను పట్టుకుని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఒకరిది శాస్త్రిపురం, మరొకరు నిలోఫర్‌ ప్రాంతానికి చెందిన వారిగా తేలింది. వారు వాడిన వాహనం గుర్తుతెలియని ఓ వ్యక్తి రెండు వేలకు అమ్మగా దాన్ని తీసుకుని చార్మినార్‌ వెళ్లి అక్కడి నుంచి నెక్లెస్‌ రోడ్డువైపు వస్తున్నారు. ఈ వాహనం చోరీకి గురైనట్లు నార్సింగ్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఉందని పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పిల్లలపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు వివరించారు. వాహనం అమ్మిన వారి కోసం ఆరా తీస్తున్నారు.

ఇదీ చూడండి: CM KCR: సచివాలయ పనులను వేగవంతం చేయండి: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details