తెలంగాణ

telangana

ETV Bharat / state

శిశువుల క్రయవిక్రయ ముఠా అరెస్ట్​ - child trafficking

అప్పుడే పుట్టిన శిశువులను పేదల నుంచి కొనుగోలు చేసి పిల్లలు లేనివారికి విక్రయించే అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్​ పోలీసులు చేధించారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రధాన నిందితుని కోసం గాలిస్తున్నారు.

శిశువుల క్రయవిక్రయాలు చేసే ముఠా అరెస్ట్​
శిశువుల క్రయవిక్రయాలు చేసే ముఠా అరెస్ట్​

By

Published : Feb 4, 2020, 2:38 PM IST

హైదరాబాద్​లో అప్పుడే పుట్టిన శిశువులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిరుపేద కుటుంబాలు, తండాలకు చెందిన కుటుంబాల నుంచి శిశువులను కొనుగోలు చేసి... పిల్లలు లేని వారికి లక్షల రూపాయలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరికి సంతాన సాఫల్య కేంద్రాలు సహకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ముఠాలో 6 గురిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. కేవలం 70 వేలకు తండాలలో శిశువును కొనుగోలు చేసి సుమారు 14 లక్షల రూపాయలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకూ 14 మంది శిశువులను విక్రయించినట్లు నిర్దారించారు.

ABOUT THE AUTHOR

...view details