కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేద చిన్నారులకు సహాయం అందించేందుకు ఆధ్యా అనే చిన్నారి నడుం కట్టింది. అందుకోసం దాతల నుంచి రూ.4.25 లక్షలను సేకరించి... చాయిస్ ఫౌండేషన్‌కు అందించింది. చిన్నారుల్లో సేవా భావం పెంపొందించేందుకు చాయిస్ ఫౌండేషన్ 'చిల్డ్రన్ ఫర్ చిల్డ్రన్' పేరుతో గత కొన్నేళ్లుగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది.
24 లక్షల రూపాయల సేకరణ
జంటనగరాల్లోని అనేక మంది ప్రముఖులు, సెలబ్రిటీల పిల్లలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. చిన్నారులే స్వయంగా దాతల నుంచి డబ్బులు సేకరించి ఆపదలో ఉన్న పేద పిల్లల వైద్య సేవలకు సహకరిస్తూ వస్తున్నారు. లాక్‌డౌన్ ప్రారంభమైన తరువాత 12 మంది చిన్నారులు 62 దేశాలకు చెందిన 330 మంది దాతల నుంచి 24 లక్షల రూపాయలు సేకరించారు.
62 మంది దాతల నుంచి రూ.4.25 లక్షలు
వీరిని స్ఫూర్తిగా తీసుకొని నాలుగేళ్ల చిన్నారి ఆధ్యా 10 రోజుల్లో 62 మంది దాతల నుంచి రూ.4.25 లక్షలు సేకరించి ఫౌండేషన్‌కు చెక్‌లు అందజేసింది. పంజాగుట్టలోని ఓ ఆస్పత్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఎండీ డాక్టర్ సతీశ్, ఫౌండేషన్ సభ్యులు శోభు యార్లగడ్డ, మాదవి, ఆధ్యా తల్లిదండ్రులు సందీప్, రిచీ తదితరులు పాల్గొన్నారు.
చిన్నారి ఆధ్యా చిరు ప్రాయంలోనే సేవ గుణం కలిగి ఉండటం ఆనందంగా ఉందని డాక్టర్ సతీశ్, ఫౌండేషన్ సభ్యుడు శోభు యార్లగడ్డ అన్నారు. చిన్నారి ఆధ్యా స్వయంగా 62 మందికి ఫోన్ చేసి చిన్న పిల్లల వైద్యం కోసం డబ్బులు సేకరించడం చాలా సంతోషంగా ఉందని తల్లి రిచీ తెలిపారు.
వసయసు చిన్నే.. కానీ మనసు చాలా పెద్ద.. ఇవీ చూడండి: నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం.!