తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇంధన సమర్థ వినియోగంతోనే అభివృద్ధి సాధ్యం'

దేశ ఆర్థిక వ్యవస్థ సమర్థ ఇంధన వినియోగంపై ఆధారపడి ఉందని సక్ష్యం- 2020 సెమినార్ అభిప్రాయపడింది. శిలాజ ఇంధనాల వినియోగంలో మార్పులు.. మన అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో సదస్సులో చర్చించారు.

cheif secretary somesh kumar spoke on oil conservation
'ఇంధన సమర్థ వినియోగంతోనే అభివృద్ధి సాధ్యం'

By

Published : Jan 17, 2020, 5:14 PM IST

హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆయిల్ అండ్ గ్యాస్ కన్వర్వేషన్ ఆధ్వర్యంలో సక్షం పేరుతో సదస్సు జరిగింది. ఇందులో శిలాజ ఇంధనాల సమర్థ వినియోగంపై చర్చించారు. ఈ కార్యక్రమానికి రవాణాశాఖ ఎండీ సునీల్ శర్మతో పాటు.. సీఎస్ సోమేష్ కుమార్ పాల్గొన్నారు. ఫ్యుయల్ ఎఫెషియన్సీలో వాహనాలు నడుపుతోన్న టీఎస్​ఆర్టీసీ రాష్ట్రం తరుపున స్కోచ్ అవార్డు అందుకుందని సునీల్ శర్మ తెలిపారు. పునర్వినియోగం కాని శిలాజ ఇంధనాల సమర్ధ వినియోగంతోనే అభివృద్ధి దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆధారపడ్డాయని ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు.

ఈ సందర్భంగా టీఎస్​ఆర్టీసీలో ఫ్యుయల్ ఎఫిషియన్సీలో ఉత్తమంగా నిలిచిన డిపోలకు అవార్డులు అందచేశారు. పర్యావరణ రక్షణపై కేంద్రీయ విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించి అవార్డులు అందజేశారు.

'ఇంధన సమర్థ వినియోగంతోనే అభివృద్ధి సాధ్యం'

ఇవీ చూడండి: 'ఈటీవీ భారత్' ఒక అద్భుతమైన రూపకల్పన: దత్తాత్రేయ

ABOUT THE AUTHOR

...view details