తన అకౌంట్లో నుంచి తన ప్రమేయం లేకుండానే డబ్బులు దుబాయ్‌కి ట్రాన్స్ఫర్ అయ్యాయని ఓ స్టేషనరీ దుకాణ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ గౌలిగూడలోని స్టేషనరీ దుకాణ యజమాని అయిన బాబు సింగ్... తన అకౌంట్ నుంచి దుబాయ్‌కి చెందిన ఓ అకౌంట్లోకి రూ. 4లక్షల 30 వేలు ట్రాన్స్ఫర్ అయ్యాయని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పనిచేసే దుకాణానికే కన్నం వేసి జైలుపాలైన ప్రబుద్ధుడు - గౌలిగూడలోని ఓ స్టేషనరీలో చోరీకి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్
పనిచేసే దుకాణానికే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. చివరకు కటకటలాపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లోని గౌలిగూడలో జరిగింది.
పనిచేసే దుకాణానికే కన్నం వేసి జైలుపాలైన ఓ ప్రబుద్ధుడు
అదే దుకాణంలో పనిచేస్తున్న అకౌంటెంట్ ఎల్బీనగర్ నాగోల్‌కు చెందిన భాస్కర్ బుచ్చిరాజు ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో తెలింది. దుబాయ్‌లో ఉండే తన మిత్రునికి యాప్ ద్వారా పంపినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైం పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
ఇదీ చూడండి :'పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు'